లారీ, బస్సు ఢీ… ముగ్గురు మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : నిజామాబాద్‌ జిల్లా చక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణపాలయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలం బడాపహాడ్‌ దర్గాకు మొక్కులు తీర్చుకునేందుకు కరీంనగర్‌ జిల్లా రాయకల్‌ మండలం మైతాపూర్‌ గ్రామానికి చెందిన 50 మంది ప్రైవేట్‌ బస్సులో బయలుదేరారు. అర్ధరాత్రి మునిపల్లి గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్‌ సయ్యద్‌అక్బర్‌ (21), బస్సులోని ప్రయాణికుడు బుచ్చిరెడ్డి (32)లు అక్కడికక్కడే మరణించారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చక్రాన్‌పల్లి పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చించారు.  ఆసుపత్రులలో చికిత్స పొందుతూ  రాజ్‌బీ (70) మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. క్షతగాత్రులు చికిత్స చేయించుకొని స్వస్థలాలకు వెళ్లిపోయారు.