లావా విరజిమ్ముతున్న విలారికా అగ్నిపర్వతం

భయాందోళనల్లో స్థానికులు, రెడ్‌ అలర్ట్‌ ప్రకటన

పకాన్‌, మార్చి 4 : చిలీ దేశం పకాన్‌ నగరం సమీపంలోని విలారికా అగ్ని పర్వతం పెద్ద స్థాయిలో లావాను విరజిమ్ముతోంది. అగ్నిపర్వతం పరిసర ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దాంతొ ఎమర్జన్సీ కార్యాలయ సిబ్బంది రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. దేశ అధ్యక్షురాలు మిసెల్‌ బాస్‌లెట్‌ ఆ ప్రాంతంలో పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె స్థానికులను స్వయంగా పరామర్శించనున్నారు. చిలీలో రెండువేలకు పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో 90 అగ్ని పర్వతాలు క్రియాశీలకంగా ఉన్నాయి. వాటిలో ఒకటైనా విలారికా అగ్నిపర్వతం ఎత్తు 9 వేల అడుగులు. 1984 తర్వాత ఈ అగ్నిపర్వతం ఇంత పెద్ద స్థాయిలో లావా విరజిమ్మడం ఇదే మొదటిసారి.