లిక్కర్ మాఫియాకు అడ్డాగా మోత్కూర్
మోత్కూర్ ఆగస్టు 27 జనంసాక్షి : లిక్కర్ మాఫియాకు అడ్డాగా మోత్కూర్ మండలం అయిందని, కేవలం మండల, మున్సిపాలిటీ కేంద్రంలోనే దాదాపు 100 కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ మైనార్టీ విభాగం ఆర్గనైసింగ్ సెక్రటరీ ఎండి. అయాజ్ ఆరోపణలు చేశారు. శనివారం మోత్కూర్ మున్సిపాలిటి కేంద్రంలో ఆయాజ్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న విద్యార్థులను యువతను లిక్కర్ ,గంజాయి మాఫియా అనే భయంకరమైన ఉచ్చులో బిగిస్తున్నారని అన్నారు. ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణ గా మార్చేసిందని ఈ మధ్యకాలంలో లిక్కర్ త్రాగటంలో యువత యొక్కశాతం విపరీతంగా పెరిగిపోతుందని యువత ,విద్యార్థులు తమ కన్నా కళలు ప్రక్కదోవపట్టి లిక్కర్ కు బానిస అయి తమ యొక్క భవిష్యత్తు ను కోల్పోవడమే కాకుండా తల్లిదండ్రులను మానసికంగా, కొంత మంది యువత శోకసంద్రం మిగుల్చుతున్నారని లిక్కర్ తెలంగాణగా మార్చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబు దారితనంగా పని చేయకుండా రాజకీయనాయకులకు ఏంగిలి మెతుకులకు, వారు ఇచ్చే కమిషన్లకు కకృత్తి పడి వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం లేదని ఇప్పటికైనా అధికారులు మేల్కొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షములో మండల కేంద్రంలో భారీ ఎత్తున జనసంద్రోహంతో ధర్నా, రాస్తా రోకోలు నిర్వహించి బెల్ట్ షాపులు పైన దాడి చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.