లిటిగేషన్లలో పోలీసుల వేలుపై అధికారుల ఆగ్రహం?

భూవివాదాలపై అవగాహన పెంచుకోవాలి
హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ఇటీవల భూ వివాదాలు పెరిగాయి. సరైన భూ రికార్డులు లేని  కారణంగా ప్రతిదీ వివాదంగా మారి లిటిగేషన్లను పెంచుతోంది. దీంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం, కేసులు వేసుకోవడం, పోలీసులను ఆశ్రయించడం పెరుగుతోంది.  భూ వివాదాలు పరిష్కరించుకునేందుకు బాధితులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌ కి వస్తున్నారని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే భూ వివాదాలు, సరిహద్దుల విషయంలో పోలీసుల పరిధి ఏంటో తెలుసుకోవాలని సూచించారు. యజమానికి  భూమిపై పూర్తి హక్కులున్నాయనే విషవాన్ని ఎలా నిర్దారించుకోవాలి? ఫోర్జరీ పత్రాలు సృష్టించారని బాధితులు కోర్టుకు వస్తే ఎం చేయాలి .. వంటి విషయాలపై పోలీసులకు అవగాహన కల్పించనున్నారు. చట్ట ప్రకారం భూమి ఎవరి అధీనంలో ఉంటే వారే యజమానులు. వారికి పట్టాదార్‌ పాస్‌బుక్‌ , టైటిల్‌ డీడ్‌ , రెవెన్యూ రికార్డుల్లో పేరుందో చూసి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. టైటిల్‌ డీడ్‌, పట్టాదార్‌ పాసుబుక్‌ , 13 బి సర్టిఫికెట్‌, అసైన్డ్‌ భూమి అయితే లావణి  పట్టా , రక్షిత కౌలు దారుకి ఇచ్చే 38 ఈ  సర్టిఫికెట్‌, కొనుగోలు చేస్తే రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌ , అటవీ ప్రాంతంలో సాగు చేస్తే అటవీ హక్కు పత్రం తదితర ధ్రువపత్రాలను పరిశీలించి ఘటనా స్థలంలోనే వాస్తవ యజమానిని నిర్దారించవచ్చు.  తెలంగాణాలో మొత్తం 112 భూ చట్టాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 52 చెత్తలు అమల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే పోలీసులు ముఖ్యమైన 12 చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమకు సత్వర న్యాయం కోసం అందరూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.