లిటిల్ ఫ్లవర్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాపేటలో గల లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బతుకమ్మలు అందరినీ అలరించాయి. విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శేర్ల.అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ కు మాత్రమే ప్రత్యేకమైన పెద్ద పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ.రంగురంగుల పూలతో త్రికోణకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ పాటలు పాడే విధానాన్ని విని, చూసి తరించాలి తప్ప వర్ణించడం కష్టం. 9 రోజులపాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అంటే నవాబులు భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బ్రతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ… బ్రతుకమ్మ అని దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ పండుగ వెనుక ఉండే అర్థం ఇది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి గుండు. శ్రీ ప్రియ 8వ తరగతి, ద్వితీయ బహుమతి ప్రైసీ 2 వ తరగతి,తృతీయ బహుమతి చందన 9వ తరగతి, కన్సోలేషన్ బహుమతి రాఘవి నాలుగవ తరగతి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేర్ల. రజిని మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సాలేహ, పూర్ణిమ, రజిత, కృష్ణవేణి, తులసి, యాకుబ్ పాషా, సాయికుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్కతుర్తి.ఆనంద్ మోహన్ గారు, లేడీ జాయింట్ సెక్రెటరీ మామిడాల శశిరేఖ గారు పాల్గొని ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు.
Attachments area
ReplyForward
|