లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఎసిబి సోదాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌4  (జనంసాక్షి):  తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులుచేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని వైష్ణవి అపార్ట్‌మెంట్స్‌లోని ప్లాట్‌ నెంబర్‌ 302లో మధుసూదన్‌ రెడ్డి నివాసముంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధుసూదన్‌ సొంత నివాసంతో పాటు  బంధువులు, స్నేహితుల నివాసాల్లో ఏక కాలంలో 11 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.