లేడిస్ సీట్లో కుర్ఛుంటే రూ.500ఫైన్..!
హైదరాబాద్ : నవంబర్ 9,(జనంసాక్షి): ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నల్లో ఆంధ్రప్రవేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏసీఎస్‌ఆర్టీసీ) ఉంది. బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్టల్లో కూర్చునే పురుషులకు రూ. 500 జరిమానా విధించే చట్టం తీసుకరావలనే ఆలోచనలో ఉంది.
ఆర్టీసీ అధికారులు చెప్పినవిధంగా మహిళలకు సీటి సర్వీసుల్లో 40%, గ్రామీణ సర్వీసుల్లో 30%..సీట్లను కేటాయిస్తున్నారు. కానీ మహిళలకు కేటాయించిన సీట్లను పురుష పుంగవులు అక్రమించుకుంటున్నారు.మహిళలకు అదే పనిగా వేడుకున్నప్పటికీ వారికి కేటాయించిన సీట్ల నుంచి కదలటానికి మగ మహరాజులు ససేమిరా అంటూన్నారు… దీంతో మహిళ ప్రయణికుల సంఖ్య రాను రాను తగ్గిపోతున్నది. బస్సుల్లో సీట్లు లేని కారణంగా పిల్లల తల్లులు, వృధ్ద మహిళలు ఇబ్బందులు పడుతున్నరని మహిళ కార్యకర్త ఎ.సురేఖ తెలిపారు. ”మహిళలకు కేటాయించిన సీట్లల్లో కూర్చోరాదంటూ పురుషులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గత వారం రోజులుగా చేపడుతున్నాం.. అని ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకులు ఎ.కోటేశ్వర్‌రావు తెలిపారు.