లై డిటెక్టర్ పరిక్షకు ముందుకురా!
నీ ”చంద్రజ్యోతి” ఛానలే వేదిక
బాబుకు కేటీఆర్ సవాల్
హైదరాబాద్,జూన్8(జనంసాక్షి): దమ్మురటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లై డిటెక్టర్ పరిక్షకు రావాలని, వేదిక కావాలంటే నీ చంద్రజ్యోతి ఛానెల్లోనే పెట్టుకుందాం రా! అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం జరిగి ఐదురోజులు గడుస్తున్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నాడని తెలంగాణమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అంతరం సృష్టించేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపింఆచరు. రేవంత్‌రెడ్డిది తప్పు అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదా తాను చేసింది తప్పు అని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మహానాడు వేదికగా గొర్రెలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇప్పుడే సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. శిఖండి రాజకీయాలు ఇకనైనా ఆపితే మంచిదని హితవు చెప్పారు. అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కాదు… సీబీఎన్ చంద్రజ్యోతి చానల్ అని అన్నారు. తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి సీఎం పదవి లైసెన్స్ కాదు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. వైరా ఎమ్మెల్యే వ్యవహారంలో ఏబీఎన్ ప్రసారాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. అవసరమైతే అన్ని చానళ్ల ప్రత్యక్ష ప్రసారాల్లో లైడిటెక్టర్ టెస్ట్‌కు వెళ్దామని చంద్రబాబుకు కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడు దొంగఎవరో నిజమేమిటో తెలుసుందని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్తరిష్ట కోసం ఎదుటి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు టేపుల వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టేపుల వ్యవహారంపై విూడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదన్నారు. ఈక్రమంలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారని కేటీఆర్ తెలిపారు. ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. ఈ వ్యవహారాన్ని తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చుకోవాలనుకోవడం సరికాదన్నారు. తనవి కూడా కొన్ని టేపులు బయటికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని, దానిపై లైడిక్టెర్ పరీక్షకు సిద్ధం…చంద్రబాబు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పంపారా లేదా అన్నది ప్రజలకు తెలిసిపోతుందన్నారు.తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని కాబట్టి విచారణకు సిద్ధపడాలని కేటీఆర్ పేర్కొన్నారు. టేపుల విడుదలపై ఏసీబీ విచారణ జరుపుతోందన్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని స్టీఫెన్‌సన్, సబాస్టియన్ల ఫోన్ల రికార్డుల్లోనే తాజా సంభాషణలు అని ఏసీబీ అధికారులు చెబుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. అందుకే తనపై వచ్చిన ఆరోపణలపై లైడిటెక్టరు పరీక్షలకు సిద్ధమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చంద్రబాబు వ్యవహారంతో తెలంగాణ సర్కారుకు సంబంధం లేదని, దీనిపై ఏసీబీ విచారణ జరుపుతుందన్నారు.