లోక్‌సభలో నేడు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై నేడు లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది, తమకు సరైన సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నా… యూపీఏకు మద్దతిచ్చే అంశంపై ఎస్సీ, బీఎస్సీ పక్షాలు ఇంకా స్పష్టతపివకవ్వలేదు. ఎస్సీ ఓటింగ్‌ నుంచి గైర్హాజరు కావచ్చని, బీఎస్సీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయవచ్చని భావిస్తున్నారు. యూపీఏ భాగస్వామ్యపక్షం డీఎంకే ఎఫ్‌డీఐలను వ్యతిరేకించినా.. ఓటింగ్‌లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టబోమని స్పష్టం చేసింది. ఎఫ్‌డీఐలపై 184వ నిబంధన కింద నిన్న సభలో చర్చ ప్రారంభం కాగా విపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాయి.