లోక్‌సభలో వివాహవయసు బిల్లు
ప్రవేశ పెట్టిన కేంద్రమంత్రి స్మృతి
వ్యతిరేకించిన పలువురు ఎంపిలు
స్టాండిరగ్ కమిటీకి పంపుతున్న ప్రకటన
న్యూఢల్లీి,డిసెంబర్21(జనం సాక్షి ): బాల్య వివాహాల నిరోధక చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం స్టాండిరగ్ కమిటీకి పంపింది. బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్ సభలో వాడీ వేడి చర్చ జరిగింది. అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండానే కేంద్రం ఏక పక్ష నిర్ణయం తీసుకుందని విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును తొలుత స్టాండిరగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు 2021ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అన్ని మతాల్లో వివాహ వయసు ఒక్కటిగా ఉండాలని అన్నారు. ఈ సవరణ బిల్లుతో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెరుగుతుందని, బిల్లుకు మద్దతిచ్చిన సభలోని పురుష సభ్యులందరికీ స్మృతి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్న ఆమె.. మహిళలు, పురుషుల పట్ల తమకెలాంటి భేదభావం లేదని చెప్పారు. అమ్మాయిలు 18 ఏళ్లకే గర్భం దాల్చితే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పెళ్లి వయసు పెంచితే అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని స్మృతి అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు తీసుకొచ్చిన ప్రధానికి దేశ మహిళల తరఫున కృతజ్ఞతలు చెప్పారు.
అయితే స్మృతి ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అభిప్రాయపడ్డారు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తెచ్చిన బిల్లును స్టాండిరగ్ కమిటీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా బిల్లులు ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. విపక్ష సభ్యుల అభ్యంతరాలపై స్పందించిన
మంత్రి స్మృతి ఇరానీ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఎంపీలు మహిళలను సమానత్వ హక్కుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు 2021ని స్టాండిరగ్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని, మహిళల పట్ల తమకు ఎటువంటి భేదభావం లేదన్నారు. తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ మాట్లాడుతూ.. మ్యారేజ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడిరచారు. ఆర్టికల్ 25ను ఉల్లఘించినట్లు అవుతుందని విపక్ష సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఈ బిల్లును విత్‌డ్రా చేసుకోవాలన్నారు. బిల్లు ఆర్టికల్ 19కు వ్యతిరేకమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 18 ఏళ్ల యువతి ప్రధానిని ఎన్నుకోవచ్చు అని, ఓ అమ్మాయి లివిన్ రిలేషన్‌లో ఉండవచ్చు అని, సెక్సువల్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉండవచ్చు అని అసద్ అన్నారు. కానీ 18 ఏళ్లకే పెళ్లి హక్కును ఎందుకు వద్దు అంటున్నారని అడిగారు.