లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలి
హుజూర్ నగర్ జులై 28 (జనం సాక్షి): ఆగస్టు నెల 13వ తారీఖున జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్ సి. హెచ్. ఎ. ఎన్. మూర్తి, జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర లు న్యాయవాదులను కోరారు. గురువారం కోర్టు హాల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమైనదని అట్టి భారాన్ని తగ్గించడానికి లోక్ అదాలత్ లను విరివిగా వినియోగించుకునే విధంగా కక్షిదారులను చైతన్య పరచాలని వారు న్యాయవాదులను కోరారు. రాజీ పడదగిన అన్ని కేసులలో పోలీసుల ద్వారా కక్షిదారులకు నోటీసులు పంపిస్తున్నామని వారు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ కావడానికి న్యాయవాదులు విశేషంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాస్ రెడ్డి, నట్టే సత్యనారాయణ, కృష్ణయ్య, రాఘవరావు, చనగాని యాదగిరి, మీసాల అంజయ్య, లతీఫ్, సైదా హుస్సేన్, ఒట్టికూటి అంజయ్య, బానోతు శ్రీను, కమతం నాగార్జున, కొట్టు సురేష్, గొట్టే ప్రశాంత్, పాలేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area