లోటుపాట్లు లేకుండా ధాన్యం సేకరణ
కరీంనగర్,ఫిబ్రవరి15(జనంసాక్షి): కంది రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి శ్యాంకుమార్ పేర్కొన్నారు. రైతులు ఇంటి వద్దనే కందులను ఆరబోసుకొని, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో కందుల్లో తేమశాతం పెరుగుతున్న దృష్ట్యా రైతులు వాటిని ఆరబోసుకోవాలన్నారు.. జిల్లా వ్యాప్తంగా 5 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికే 3 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందనీ, మిగతావి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇదిలావుంటే
వచ్చే యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణను సమర్థవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో ఇటీవల సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ రబీ సీజన్‌లో 1,80,000 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయశాఖ అంచనా వేసిందన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన టార్పలిన్లు వ్యవసా య మార్కెటింగ్ శాఖలో సిద్‌ధ్దంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణకు సహాకార సంఘాల ద్వారా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.