లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలి*

– సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు
జులై 14(జనంసాక్షి)
 గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలమయమైన లోతట్టు ప్రాంతాలలో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగు రైతు సంఘం మాజీ అధ్యక్షులు, సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతాలకు వర్షపు నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయ మాయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉండే పేదల ఇండ్లు, గోడలు దెబ్బ తిని ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపు నీరు అలాగే నిలిచి ఉంటే దోమలు పెరిగి, అవి కుట్టడం వలన డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని
  కనుక అధికారులు తక్షణమే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు.
Attachments area