వంట గ్యాస్ ధర తగ్గింపు ఓ తాయిలం
` రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్
న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విరుచుకుపడ్డారు. ఇది తాయిలాల సంస్కృతి కాదా అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీజీ..ఉజ్వల లబ్ధిదారులకు రూ. 400 ఊరట కల్పించడం తాయిలం కాదా..? ఇది పేద ప్రజల కోసమే అని నా అంచనా..వారిని గుర్తుపెట్టుకున్నందుకు విూకు ధన్యవాదాలు.2024 దగ్గరపడుతుండటంతో వారి గురించి విూరు ఆలోచిస్తారని అనుకుంటున్నా..అదే విపక్ష పార్టీలు ఇలాంటి ఊరట కల్పిస్తే అది మాత్రం రెవ్రీ సంస్కృతి! జైహో! అని సిబల్ ట్వీట్ చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్‌ను వీడి ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికయ్యారు.కాగా, గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిరచారు.త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతోనే కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిందని కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.