వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌

కరీంనగర్‌,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): వచ్చే పదవతరగతి పరీక్షల్లో జిల్లాలోవందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ పేర్కొన్నారు. విద్యాశాఖఅధికారులు, పాఠశాలల ప్రదానోపాధ్యాయులు ఇందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అన్నారు. డిసెంబర్‌ 31 వరకు సిలబస్‌ పూర్తి చేసి జనవరి 1

నుంచి రివిజన్‌ చేయాలన్నారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌, తెలుగు, మ్యాథ్స్‌ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాలకు వచ్చేలా ఉపాద్యాయులు కృషి చేయాలన్నారు. అప్పుడప్పుడు గైర్హాజరు అయ్యే విద్యార్థుల ఇల్లకు ఉపాద్యాయులు వెల్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యావశ్యకత గురించి వివరించాలన్నారు. తల్లిదండ్రులతో ప్రదానోపాద్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సాదారణ సమావేశాలెర్పాటు చేసి కౌన్సిలింగ్‌ ఇవ్వలన్నారు. ఉపాద్యాయులు విద్యార్థుల ఇల్లకు వెల్లితే వారి తల్లిదండ్రులతో అనుబందం పెరుగుతుందని ఉపాద్యాయులపై గౌరవంతో పిల్లలను ప్రతి రోజు పాఠశాలకు పంపిస్తారన్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గ్రూప్‌లుగా చేసి చదివించాలన్నారు. మండల విద్యాధికారులు తరచుగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో పదవతరగతిలో కనీసం ఇద్దరు ముగ్గురు పది జిపిఎ సాదించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.