వంద బిలియన్‌ డాలర్లతో బ్రిక్స్‌ బ్యాంకు

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను బయటపడేయడమే లక్ష్యం
డర్బన్‌, (జనంసాక్షి) :
వంద బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధితో బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తామని సభ్య దేశాలు తీర్మానించాయి. డర్బన్‌లో జరుగు తున్న బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఆయా దేశాలను బయటపడేయడమే లక్ష్యంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసే దిశగా బ్యాంకును ప్రారంబి óస్తామని పేర్కొన్నారు. సదస్సు అనంతరం ‘ఎథక్విని’ (డర్బన్‌ డిక్లరేషన్‌) ప్రకటించారు. ‘మా ఆర్థిక మంత్రుల నివేదిక ప్రకారం కొత్త అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు ఆచరణ యోగ్యమైనది, సరైనదిగా మేం సంతృప్తి చెందాం.’ అని సభ్యదేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే బ్రిక్స్‌ ప్రత్యేక వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణచించింది. ఈ సదస్సు గురువారం ముగియనుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ, గతేడాది ఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత్‌ ప్రతిపాదించిన అభివృద్ధి బ్యాంకు సభ్య దేశాల    నుంచి తలా 10 బిలియన్‌ డాలర్ల భాగస్వామ్యంతో 50 బిలియన్‌ డాలర్ల మూలధనంతో ప్రారంభించాలని ప్రతిపదించిందని తెలిపారు. కానీ ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి బ్యాంకుఏర్పాటు మూల ధనాన్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. సభ్యదేశాల సహకారంతో అభివృద్ధి దేశాల సరసన ఆయా దేశాలను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.