వక్ఫ్‌ భూముల కబ్జాకు తలసాని కుట్ర

.4

హైదరాబాద్‌, ఆగష్టు 28 (జనంసాక్షి):

సనత్‌నగర్‌ జెక్‌కాలనీలో ఎకరం భూమిని ఆక్రమించుకోవాలని కాలనీ వాసులను మంత్రి తలసాని ఉసిగొల్సడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి చర్యలకు సిఎం అనుమతి ఉందా లేక సిఎం కనుసన్నల్లో ఇది జరగుతుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వక్ఫ్‌ భూములను ఆక్రమించుకోవాలని చెబుతున్నారని, ఓపెన్‌ టెండర్‌ ద్వారా లీజుకివ్వొచ్చని అధికారులు చెబుతుంటే మంత్రి తలసాని మాత్రం కబ్జా చేయాలని చెబుతున్నారని ఆయనన్నారు. అలాగే…. ఎన్నికల ప్రచారంలో మైనార్టీలకు సీఎం ఎన్నో వాగ్దానాలిచ్చారని, వక్ఫ్‌ భూములను కాపాడుతామని హావిూ ఇచ్చారని, అయితే మంత్రి తలసాని మాత్రం భూముల ఆక్రమణను ప్రొత్సహిస్తున్నందున ఆయనపై సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తలసాని రాజీనామా చేసినా మంత్రిగా కొనసాగడం వల్ల ఆయన చేస్తున్న తప్పులకు సిఎం బాధ్యత వహించాలన్నారు. తలసాని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.