వచ్చే ఎన్నికల్లో ‘కరీంనగర్ ‘ కైవసం ఖాయం

టీడీపీ కరీంనగర్ నియోజకవర్గ
ఇన్చార్జి గంగాధర కనకయ్య

కరీంనగర్ (జనం సాక్షి ):  వచ్చే శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి తెలుగుదేశంపార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ ఆపార్టీ కరీంనగర్ నియోజకవర్గఇన్చార్జి గంగాధర కనకయ్య స్పష్టం చేశారు. బుధవారంకరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపోటీ చేసి కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోవడంఖాయమని కనకయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తిపెల్లువెత్తుతున్నాయన్నారు.ప్రజలు మార్పును కోరుకుంటున్నారని,అందుకు తెలుగుదేశం పార్టీయే సరైనదనే భావన ప్రజల్లో బలంగా నెలకొనిఉందన్నారు. నగరంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో
భాగంగా పార్టీ డివిజన్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తున్నామన్నారు. తొలి విడతగా 60 డివిజన్లకుగాను 35 డివిజన్లకు అధ్యక్షులను నియమించామన్నారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ అధ్వర్థులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ
పరిశీలకుడు వంచ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి దామెర సత్యం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాడపు ఆగయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి వినీత్, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి సాయిల్ల రాజమల్లయ్య, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రవెల్లి రవీందర్, తెలుగు మహిళ పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నవేణి రజిత, బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు తాటికొండ శేఖర్, మైనార్ట్ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు బసాలత్, పార్టీ నాయకులు సందబోయిన రాజేశం, తీగుట్ల రమేశ్ కుమార్,దాసరి రామకృష్ణారెడ్డి, హయగ్రీవచారి, లక్ష్మన్ రావు, రొడ్డ శ్రీనివాస్, రొ డ్డ శ్రీధర్, చుట్టాకుల శ్రవణ్ కుమార్, ఎస్కె అహ్మాద్,మహబూబాఖాన్,నరేందర్ దత్తు ,నసీర్, సమీర్ తదితరులు పాల్గున్నారు.