వచ్చే నెలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను జాతీయ విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులకు నవంబర్ మూడో వారంలో జిల్లా స్థాయి సైన్స్ , మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు డిఈఓ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.సాంకేతిక – బొమ్మలు అనే ప్రధాన అంశం మీద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతి, ఏకో ఫ్రెండ్లీ మెటీరియల్ , ఆరోగ్యం – పరిశుభ్రత, రవాణా – ఆవిష్కరణ, పర్యావరణ ఆందోళనలు , ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రక అభివృద్ధి , మనకోసం గణితం అనే ఉప అంశాల మీద విద్యార్థులు ఎగ్జిబిట్స్ తయారుచేసేలా ఆయా పాఠశాలల హెచ్ఎంలు, గైడ్ టీచర్లు ప్రోత్సహించాలని అన్నారు.సమస్యలకు పరిష్కారం చూపే నాణ్యమైన ప్రాజెక్టులు తయారు చేసేలా చూడాలని కోరారు.మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి దేవరాజును సంప్రదించాలని సూచించారు.