వజ్రోత్సవాల సందర్భంగా ఆటల పోటీల నిర్వహన

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణములోని యువకులకు కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ టగ్ ఆఫ్ వార్,మొదలగు క్రీడలు రామకృష్ణాపూర్ పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ అశోక్, ఏఎస్ఐ శ్రీనివాస్, జెడ్ పి హెచ్ ఎస్ హెడ్మాస్టర్ సుధాకర్, స్టాప్ పాల్గొనడం జరిగినడది. ఈ సందర్భంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామని, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని యువకులచే ప్రతిజ్ఞ చేయించడమైనది.
వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల నిర్వహణ:భారత వజ్రోత్సవాలను పురస్క రించుకుని స్థానిక సెయింట్ జోసెఫ్, సెయింట్ జాన్స్, అల్ఫోన్సా, తవక్కల్, ఎస్.ఆర్.కే.పాఠశాలల్లో వివిధ విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో దేశభక్తి, దేశ సేవా తత్పరత మొదలగు గ్రహింపు ఇలాంటి అంశాల ద్వారా నెలకొంటుందని పలువిద్యా సంస్థల ఆచార్యులు తెలిపారు