వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ
ముంబై,,సెప్టెంబర్29(జనంసాక్షి):
నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సవిూక్షను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో రఘురామ్‌రాజన్ మాట్లాడుతూ… కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించినట్లు ప్రకటించారు. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. దీంతో రెపో రేటు నాలుగేళ్ల కనిష్ఠస్థాయి 6.75శాతానికి చేరింది. వర్షాభావ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని, 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం 5.8 శాతం ఉటుందని ఆర్‌బీఐ అంచానవేస్తున్నట్లు రాజన్ చెప్పారు. 2015-16లో వృద్ధిరేటు అంచనాను 7.6శాతం నుంచి 7.4శాతానికి తగ్గించనిట్లు పేర్కొన్నారు. 2018 మార్చి నాటికి ప్రభుత్వ బాండ్లలో ఎఫ్‌సీఐ పెట్టుబడి పరిమితిని దశలవారీగా 5 శాతానికి పెంచుతామని రాజన్ వెల్లడించారు. ఆర్‌బిఐ నిర్ణయంతో దేశంలో గృహరుణాలకు వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సవిూక్ష జరిగింది. ఆర్‌బీఐ రెపోరేట్లను తగ్గించింది. 50 బేసిక్ పాయింట్లు రెపోరేటు తగ్గింది. కొత్త రేపోరేటు 6.75 శాతం ఉంది. 2017 నాటికి ద్రవ్యోల్భణం 4 శాతంగా ఉంటుంది. ఇదిలావుంటే స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 260 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 80 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతున్నాయి.