వనపర్తిని పునర్నిర్మాణం చేస్తున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఓరియంటేషన్

మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి బ్యూరో అక్టోబర్07 (జనంసాక్షి)

వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థుల ఓరియంటేషన్ మరియు నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా భారస జిల్లా అధికార ప్రతినిధి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటుకు విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేసిందని అందులో భాగంగా అనేక రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలతో పాటు మా బడి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల ఏర్పాటుకు కంకణం తీసుకుందని విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో రెసిడెన్షియల్ పాఠశాలని విద్యార్థికి ఒక్కొక్కరికి 1,25,000 చొప్పున కేటాయించిందని కొనియాడారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిని విద్యాపర్తి గా మార్చడంలో ఇప్పటికే సఫలీకృతుడయ్యాడని తెలియజేశారు ఇందులో భాగంగా వనపర్తి లో మెడికల్ కళాశాల ఏర్పాటు ఇంజనీరింగ్ కళాశాల ఫిషరీస్ కళాశాల నర్సింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల పూర్వ వైభవం కోసం రాజప్రసాద పునర్నిర్మాణానికి 22 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత నిరంజన్ రెడ్డి గారిది అని తెలియజేశారు విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో మీ మూడు సంవత్సరాల డిగ్రీ పట్టాను పొందాలని జీవితంలో ఈ మూడు సంవత్సరాల మీ జీవితానికి దిశా దశ నిర్ణయిస్తుందని నిజజీవితంలో మీరు నిరదోక్కోవడానికి డిగ్రీ చదివే మలుపు అవుతుందని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులను ఉపయోగించుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తద్వారా మీ గురువులకు తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని కోరారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు