వన్డే చరిత్రలో సరికొత్త అధ్యాయం

fq9qqfw5లేటు వయసులో ఘాటు ఆట. కెరీర్ ఎండింగ్ లో సెంచరీల మోత. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా నాలుగు శతకాలు. వన్డే చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాడు లంక వెటరన్ సంగక్కరా.. నాలుగు వన్డేల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా అరుదైన ఫీట్ సాధించాడు. గ్రేట్ వార్ లో టాప్ స్కోరర్ గా దూసుకుపోతున్నాడు.

కెరీర్ లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న సంగా.. అల్టిమేట్ టచ్ తో దూసుకుపోతున్నాడు.. బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తో పాటు ఆసీస్ పై సెంచరీ చేసిన సంగా.. పసికూన స్కాట్లాండ్ పైనా వీరవిహారం చేశాడు.. 95 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 124 పరుగులు చేశాడు.. లంక భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించాడు.

ఇక వన్డేల్లో వరసగా నాలుగు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. వరల్డ్ కప్ లో ఆసీస్ పై సెంచరీతో హ్యాట్రిక్ సెంచరీ చేసిన సంగ.. నాలుగో శతకం చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇక విశ్వసమరంలో సంగానే టాప్ స్కోరర్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లాడిన సంగా.. 124 సగటుతో 496 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ హిస్టరీతో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డుకు చేరువయ్యాడు.

ఓవరాల్ గా ఈ వరల్డ్ కప్ సంగా కెరీర్ లో ఓ చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. కెరీర్ లోనే భీకరమైన ఫామ్ లో ఉన్న లంక వెటరన్.. మెగాటోర్నీలో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయం.