వన్‌ ర్యాంక్‌ – వన్‌ పెన్షన్‌పై సర్కార్‌ ప్రకటన

5

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జనంసాక్షి):

గత నాలుగు దశాబ్దాలుగా సైనికులకు ఉద్దేశించిన ప్రతిష్టంభనలో ఉన్న ఒకే ర్యాంకు ఒకే పింఛను అంశంపై కేంద్రం ప్రభుత్వం శనివారం ప్రకటన వెలువరించింది. భారత మాజీ సైనికోద్యోగుల సంఘం చైర్మన్‌ సత్బీర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో మాజీ సైనికులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ విూడియా సమక్షంలో  ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం హావిూ ఇచ్చినట్లుగా 2014 జులై 1 నాటి నుంచి ఒకే ర్యాంకు ఒకే పింఛను వర్తిస్తుందన్నారు. నాలుగు విడతల్లో ఈ మొత్తాన్ని మాజీ సైనికులకు అందిస్తామన్నారు. ఈ ప్రకటన ద్వారా ఒక్కో మాజీ సైనికుడి పింఛను రూ. 3,500 నుంచి రూ. 4000లకు పెరుగుతుందని తెలిపారు. అయితే మాజీ సైనికులు కోరినట్లుగా ప్రతి ఏటా లేదా రెండేళ్లకోసారి సవిూక్షించడం కుదరదని చెప్పారు. ప్రతి ఐదేళ్లకోసారి ఈ అంశంపై సవిూక్ష చేపడుతామన్నారు. ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు వల్ల రూ.8వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. అయితే గత ప్రభుత్వాలు ఈ భారాన్ని రూ.500 కోట్లుగా అంచనా వేశాయన్నారు. రూ.500 కోట్లు బ్జడెట్‌లో కేటాయించినట్లు చెప్పారు.దేశ సేవకు సైనికులు తమ జీవితాలను అంకితం చేస్తున్నారని కొనియాడారు. వన్‌ ర్యాంకు వన్‌ పెన్షన్‌ నాలుగు దశాబ్దాలుగా నలుగుతోందని, ఈ పథకంపై గత ప్రభుత్వం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. ఈ పథకంపై ప్రధాని మోదీ ఎన్నోసార్లు హావిూ ఇచ్చారని గుర్తుచేసిన ఆయన విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బకాయిలను నాలుగు విడతలుగా చెల్లిస్తామని చెప్పారు. అయితే స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందిన సైనికులకు ఈ పథకం వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. పథకాన్ని ప్రతీ ఐదేళ్లకోసారి సవిూక్షిస్తామన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ అంశం నలుగుతోందని చెప్పారు. ఒకే ¬దా పింఛనుపై ప్రధాని పలు మార్లు హావిూ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన సైనిక సిబ్బంది సేవలను కొనియాడారు.

రిటైర్మెంట్‌ తీసుకున్న సైనికోద్యోగులు, ఇప్పుడు రిటైర్‌ అవుతున్న, రాబోయే కాలంలో పదవీ విరమణ చేసే సైనికులందరికీ ఒకే ర్యాంకు ఆధారంగా పింఛను అందించాలంటూ గత మూడు నెలలుగా మాజీ సైనికోద్యోగులు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అంతేగాక, ప్రతి ఏడాది ఒక ర్యాంకు ఒక పింఛనును సవిూక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిపై చర్చలు జరిపిన కేంద్రం నేడు ఒకే ర్యాంకు ఒకే పింఛనుపై ప్రకటన చేసింది.