వయోవృద్ధుల వారోత్సవాలు
వరంగల్ ఈస్ట్ ,సెప్టెంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ మహానగరంలోని 42వ డివిజన్లో మాలవాడ అంగన్వాడి సెంటర్ నందు ఐసిడిఎస్ వరంగల్ ప్రాజెక్ట్ ఉరుసు సెక్టార్ సూపర్వైజర్ శ్రీమతి బత్తిన రమాదేవి అధ్యక్షతన గురువారం వయోవృద్ధుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ గుండు చందన జిల్లా సంక్షేమ అధికారి శారద హాజరైనారు
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పెద్దవాళ్ళను గౌరవించడం మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలని ప్రత్యేక పండుగ రోజు పుట్టిన రోజు పెళ్లి రోజు వేడుకలు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని ,తల్లిదండ్రుల పోషణ పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు.
జిల్లా సంక్షేమ అధికారి ని మాట్లాడుతూ వయోవృద్ధుల సమస్యల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 14567 కు ఫోను చేయవచ్చని తెలిపారు.
అనంతరం వృద్ధులను శాలువా తో పూల బొకేలు తో కార్పొరేటర్ ,జిల్లా సంక్షేమ అధికారి గార్లు సన్మానించారు
ఈ కార్యక్రమానికి సిడిపిఓ విశ్వజ ఐసిడిఎస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి తేజ ,సూపర్వైజర్ ఆశాదేవి ఉర్సుసెక్టార్ అంగన్వాడి టీచర్లు వినీత ,వనిత జ్యోతిరాణి నజీమాీ ఆయాలు తల్లులు పిల్లలు పాల్గొన్నారు