వరంగల్లో బతుకమ్మ పండుగ సంబరాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో ఆదివారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిర్వహించారు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది మహిళలు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా భక్తుశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ లో భాగంగా అందమైన రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్, ఉరుసు, రంగసాయిపేట, గిర్మాజిపేట, వరంగల్ చౌరస్తా , పోచమ్మ మైదాన్, తదితర ప్రాంతాలలో వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పట్టుకుని వచ్చి సాంప్రదాయమైన బతుకమ్మ పాటలతో ఆడి పాడారు