వరంగల్లో వ్యక్తిగత సేవ దినోత్సవం
వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 08(జనం సాక్షి)
లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యక్తిగత సేవా దినం పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 200 మంది ప్రజలకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. బైరి లక్ష్మి నారాయణ ( రీజియన్ చైర్మన్) గారు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజలకు చేయూత అందించే వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం లయన్స్ లక్ష్యం అని అన్నారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు.అధ్యక్షులు అప్పరాజు రాజు మాట్లాడుతూ లయన్స్ వేదిక ద్వారా ప్రపంచమంతా సమూహకంగా క్లబ్ ద్వారా లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు జరుగతున్నాయానీయు, నేటి ప్రత్యేకత మాత్రం వ్యక్తిగత సేవా కార్యక్రమాలు నిర్వహించుట ననియు, వ్యక్తిగా సమాజంలో ఇతరులకు నీ ఆపన్న హస్తం అందించుట ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలనే మంచి ఉద్దేశ్యం తోనే నేటి ప్రత్యేక దినాన్ని రూపకల్పన చేయడం జరిగిందనియు, నేటి కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు . అప్పరాజు రాజు ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి నరహరి, కోశాధికారి .గుండేటి రమణయ్య,ఉపాధ్యక్షులు .రావుల భాను, రీజియన్ కార్యదర్శి .పోశాల సురేందర్, ప్రముఖ సామజిక వేత్త గంగిశెట్టి హరినాథ్ పాల్గొన్నారు.