వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 28న చలో అసెంబ్లీ

4

హైదరాబాద్‌,సెప్టంబర్‌ 20(జనంసాక్షి):

వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిర సనగా ఈనెల 28న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టా లని ప్రజా పౌర సంఘాలు నిర్ణయించాయి. అత్యంత పాశ వికమైన ఈ ఘటనకు బాధ్యు లైన వారిని కఠినంగా శిక్షించ ాలని డిమాండ్‌ చేశాయి. వరం గల్‌ ఎన్‌కౌంటర్‌ పూర్వాపరాలపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. శ్రుతి, విద్యాసాగర్‌ లను నిర్బం ధించి దారుణ చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని విరసం నేత వరవర రావు ఆరోపించారు. పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిం చారని.. ఆ ఘటన కలచి వేసిందని సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం కళ్లనీళ్ల పర్యంత మయ్యారు. రౌండ్‌టేబుల్‌ భేటీకి హాజరైన సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీర భద్రం అణచివేత కేసీఆర్‌ నైజమన్నారు. కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. భేటీలో పా ల్గొన్న జస్టిస్‌ చంద్రకుమార్‌ దొరల పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు సహిం చరన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని వక్తలు ఆరోపించారు. నమ్మిన సిద్ధాం తాల కోసం పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.