వరంగల్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిన తేదేపా నేతలు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు వరంగల్‌ కలెక్టరేట్‌ని ముట్టడించారు. పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవూరి, కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబ్లీ వల్ల నష్టం లేదంటున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లిందో ప్రజలకు చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.