వరంగల్ చౌరస్తాలో షాపింగ్ సందడి..

– జనం రద్దీతో క్రిక్కిరిసిన పలు దుకాణాలు
– జన సమూహంతో నిండిన రోడ్లు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి)
ఇటు సద్దుల బతుకమ్మ అటు దసరా పర్వదినాల సందర్భంగా కొనుగోలుదారులతో వరంగల్ నగరంలోని చౌరస్తా ప్రాంతం శనివారం నిండిపోయింది. ముఖ్యంగా బట్టల షాపులు, బంగారం షాపులు, కంగన్ హాల్స్, చెప్పుల దుకాణాలు, మొదలైన షాపులలో కొనుగోలు చేసేందుకు వేలాదిగా ప్రజలు వరంగల్ జిల్లా  నగరం నలుమూలల నుండి రావడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు పిల్లలు కుటుంబ సభ్యులతో సహా చౌరస్తా, జెపిఎన్ రోడ్, బట్టల బజార్, స్టేషన్ రోడ్, బీట్ బజార్ మొదలైన ప్రధాన వ్యాపార కేంద్రాల పెద్దకు రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంతేకాకుండా రోడ్ సైడ్ తోపుడుబండ్లపై చిరు వ్యాపారుల, పూలు పండ్ల వ్యాపారుల వద్ద పలు రకాల వస్తువులు కొనేందుకు కూడా ప్రజలు రావడంతో రద్దీ కొనసాగింది. ఈనెల 3న సద్దుల బతుకమ్మ ఐదున విజయదశమి పర్వదినాలు ఉండడం వల్ల ఒకేసారి జనం షాపింగ్ చేస్తుండటంతో ప్రతి షాపు చిన్న సందోహంల మారింది. అంతేకాకుండా పలు కిరాణం, జనరల్ స్టోర్స్ కూడా రద్దీగా మారాయి. దీంతో ట్రాఫిక్కు స్తంభించిపోయింది. వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు కొంత ఇబ్బంది పడ్డారు. పలు బట్టల షాపుల వద్ద పండుగ డిస్కౌంట్ ఆఫర్లు పెట్టడంతో ఆయా షాపుల ముందు రద్దీ మరింత ఎక్కువ కొనసాగింది.