వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి)
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ ఏరియాలోని 19వ వార్డులో రామాలయం నుండి మసీదు పరిసర వీధుల్లో కలియతిరుగుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు..