వరకట్న వేధింపుల  నిందితుడికి జైలు శిక్ష

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)

 

వరకట్న వేధింపుల   గురిచేస్తున్న బొచ్చు ధర్మేందర్ లెక్చరర్, గ్రామం బండారుపల్లి ములుగు జిల్లా 498 ఏ, 506, ఎస్సీ 384 డిపి ఆక్ట్ కింద  జిల్లా జడ్జి రాపోలు అనిత గురువారం నిందితునికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష , పదివేల రూపాయల జరిమానా విధించినట్లు వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. వరకట్న వేధింపులకు గురి అయిన  బొచ్చు సుజాత అలియాస్ హాసిని పరకాల ఫిర్యాదు మేరకు కేసు నిర్ధారణ కావడంతో పై సెక్షన్ల కింద జై శిక్ష విధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పి పి ఆర్ఎస్ శ్రీనివాస్. రాధా,  ఏ. సువర్ణ ,బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.