వరదబాధితులను తక్షణమే ఆదుకోండి
టిడిపినేతలకు,ఎన్నారైలకు బాబు వినతి
అమరావతి,జూలై30 ( జనంసాక్షి): గోదావరి వరదలతో సాంతం కోల్పోయి.. రోడ్డున్న పడ్డ బాధితులకు కూరగాయలు, బియ్యం, పశువులకు గడ్డి వితరణ చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు కొంతమేరకు సాయం అందించిందని.. తెదేపా కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ముందుకు రావాలని కోరారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని దాతలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని.. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. మేత లేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయని.. కూరగాయలు, బియ్యం లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని ఆందోళన చెందారు. ఇళ్లలోకి బురద చేరి వస్తువులు పనికిరాకుండా పోయాయని వెల్లడిరచారు. బాధితులను సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ముందుకు(ఞశిని ఞజ్గీª బినీ టనీనినీసబ) రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు(ఔªుఖీ ªుసబీబబి) కొంతమేరకు సాయం అందించిందని తెలిపారు. ఇప్పటి పరిస్థితులల్లోవ పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉందని.. దాతలు వారి పేరుతో లేదా తెదేపా ద్వారా ఎండుగడ్డి వితరణ చేయాలని కోరారు. తెదేపా కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా వితరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.