వరద బాధితులందరినీ ఆదుకుంటాం

నష్టంపై అంచనాలు పూర్తికాగానే సాయం
వరదల సమయంలో అధికారులను అప్రమత్తం చేశాం
వలంటీర్లు, అధికారులు చక్కగా పనిచేశారు
పశువువులకు నోరుంటే అవికూడా మెచ్చుకునేవి
కోనసీమ వరదప్రాంతాల్లో పర్యటించిన సిఎం జగన్‌

కోనసీమ,జూలై26(జనంసాక్షి): వరద నష్టంపై అంచనాలు పూర్తికాగానే బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తామని తెలిపారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం అడిగారు. శిబిరాల్లో తమను బాగా చూసుకున్నారని వరద బాధితులు సీఎం జగన్‌కు తెలిపారు. వాలంటీర్లు బాగా పనిచేశారని అన్నారు. విూ కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని గ్రామస్తులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరదలు రాగానే
ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడిరచారు. వెంటనే అధికారులందరినీ క్షేత్రస్థాయిలోకి పంపామని, ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో ఆయన.. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. విూ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని ఆయన బాధితులతో పేర్కొన్నారు. అంతేకాదు జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు. సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. వర్షంలోనూ సీఎం జగన్‌ ఆగకుండా తన పర్యటనను కొనసాగిస్తుండడం విశేషం. బాధితులందరికీ సాయం ఎలా అందుతోంది?.. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే అడిగి తెలుసుకుంటూ కాలినడకనే ముందుకెళ్లారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్‌.. గంటిపెదపూడిలో వరద బాధితులతో మాట్లాడారు. విూ కలెక్టర్‌ పనితీరు ఎలా ఉందంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జగన్‌ విూడియాతో మాట్లాడుతూ… పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సాయం చేశామన్నారు. వరదల సమయంలో తాను వస్తే అధికారులు తన చుట్టే ఉంటారని… ప్రజలకు అన్నీ అందాకే వస్తానని అధికారులకు చెప్పానని తెలిపారు. ఇబ్బంది పెట్టకూడదనే వారం తర్వాత వచ్చా అని చెప్పుకొచ్చారు. ఏ
ఒక్కరికీ సాయం అందలేదనే మాట వినిపించలేదన్నారు. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. జీపీలంక వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. వరద బాధితులందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. వర్షంలోనూ సీఎం జగన్‌ ఆగకుండా తన పర్యటనను కొనసాగించారు. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే అడిగి తెలుసుకున్నారు.