వరద బాధితులను తోణం ఆదుకోండి

సాయంగా 5వేల నగదు, సరుకులు ఇవ్వాలి: గన్ని

ఏలూరు,జూలై14(జనం సాక్షి): వర్షం, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. అనేక గ్రామాల ప్రజలు నీట మునిగి అసవ్థలు పడుతున్నారని అన్నారు. అలాగే పంటపొలాలు నీట మునిగాయన్నారు. గురువారం విూడియాతో
మాట్లాడుతూ… వారందరికీ తక్షణ సాయం కింద రూ.5000, నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలంతా వరద నీటిలో కరెంటులేక అంధకారంలో మగ్గుతున్నారన్నారు. వారికీ రెండు క్రొవ్వొత్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కలెక్టర్‌కు ఫోన్‌ చేస్తే అందుబాటులోకి రావటంలేదని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పనికిమాలిన వాగ్దానాలు ఇచ్చారని మండిపడ్డారు. ఆర్‌.ఆర్‌ ప్యాకెజీ ఇవ్వకపోవడం వల్ల 7 మండలాల ప్రజలు ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఖాళీ చేసి వెళ్తే ప్రభుత్వం ప్యాకేజ్‌ ఇవ్వరనే భయంతో ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారని గన్ని వీరాంజనేయులు తెలిపారు.