వరల్డ్‌కప్‌లో మరో భారీ బాదుడు.. ఆసిస్ 417/5
పెర్త్ : క్రికెట్ వరల్డ్ కప్‌లో మరో భారీ స్కోరు నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ పేరిట ఉన్న అత్యుత్తమ స్కోరు (417) రికార్డును ఆసిస్ బద్దలు కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకోవడంతో బరిలో దిగిన ఆసిస్ మొదట్నుంచే తన బాదుడు ప్రారంభించింది. మొదటి వికెట్ 14 పరుగులకే కోల్పోయినా ఆ తరువాత భీభత్సం సృష్టించారు. 272 పరుగల వరకు ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
38వ ఓవర్లో డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్న వార్నర్‌కు షాపూర్ బ్రేకులు వేశాడు. 178 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఔటయ్యాడు. అక్కన్నుంచి ఆసిస్ స్కోరు బోర్డు కాస్త మందగించింది. స్మిత్(95), మ్యాక్స్‌వెల్(88)లను సైతం సెంచరీలు చేయకుండా ఆఫ్ఘన్ బౌలర్లు అడ్డుకున్నారు. దౌలత్, షాపూర్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా హమీద్ హాసన్, నవరత్ మంగళ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం వెనక ఆఫ్ఘనిస్తాన్ వ్యూహమేంటో అర్థం కాలేదు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అలా చేసిందేమో. మొత్తం మీద భారీ సాహసం చేశారు. బాగా బాదించుకున్నారు. 418 పరుగుల టార్గెట్‌కోసం బరిలో దిగారు. చూద్దాం ఎంత వరకు రీచ్ అవుతారో.