వరల్డ్ కప్: క్రికెటర్ల వెంట భార్యలు, గర్లఫ్రెండ్స్‌ ఉండేందుకు అనుమతి

spo-1న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్‌లో వరుస విజయాలను నమోదు చేసి టీమిండియా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత జట్టును సంతోషరిచే నిర్ణయాన్ని బీసీసీఐ సోమవారం తీసుకుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత జట్టు ఆటగాళ్ల ఏకాగ్రత చెదరకుండా, ఇప్పటి వరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను బీసీసీఐ అనుమతించలేదు. అయితే ఇప్పుడు బోర్డు ఆ నిబంధనను మార్చింది. క్వార్టర్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించడంతో ఆటగాళ్ల వెంట తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను ఉంచేందుకు అనుతించింది. ఇకపై వరల్డ్ కప్ సమయంలో భారత క్రికెటర్లతో వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ కలిసి ఉండే అవకాశం ఉంది. వరల్డ్ కప్: క్రికెటర్ల వెంట భార్యలు, గర్లఫ్రెండ్స్‌ ఉండేందుక టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. వరల్డ్ కప్‌కు ఆస్టేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్లో ధోని సేనతో పాటు న్యూజిలాండ్ కూడా వరుస విజయాలను నమోదు చేశాయి. మార్చి 19న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న రెండో క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.