వరుసగా మూడోరోజు వీడని వర్షం
నగరంలో మళ్లీ కుండపోత
హైదరాబాద్,అక్టోబర్5 (జనంసాక్షి) : నగరంలో కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. శనివారం సాయంత్రం క్యూములోనింబస్ మేఘాలతో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. గంట పాటు కురిసిన భారీవర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. సికింద్రాబాద్, అల్వాల్, నేరేడ్‌మెట్, మలక్‌పేట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద నీరు రహదారులను ముంచేసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జాం అయింది.