వర్షపు నీరు నిలవకుండా చర్యలు

– కమిషనర్ గుండె బాబు.
తొర్రూర్ 23 జూలై (జనంసాక్షి )
మునిసిపాలిటీలోని కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నట్లు  మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీలన్నీ జలమయమైన తరుణంలో శనివారం పట్టణంలోని రెండో వార్డు. ఏడో వార్డ్ యందు  కమిషనర్ సందర్శించారు.
ముఖ్యంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, చిన్ననాలాలు,కాలువలు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను కమిషనర్ పరిశీలించారు
    వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.  నీరు నిలవడం వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని సూచించారు.  చెత్తను సైతం ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.
ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుందని,  దీంతో కాలనీలో నీరు నిలుస్తున్నాయని తెలిపారు. సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక బృందాలు, వాహనాలు, కార్మికులను ఏర్పాటు చేశామన్నారు.
నీరు నిలవకుండా శాస్ర్తీయ పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరు నిలవకుండా సాధ్యమైన ప్రాంతాల్లో పైపులైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సాధ్యం కాని పక్షంలో ఎప్పటికప్పుడు నీటిని పంప్‌ చేసేందుకు మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు.
భవిష్యత్ లో ఇలాంటీ పరిస్థితులు తలెత్తకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఖాళీ ప్లాట్ లలో నీరు నిలవకుండా సంబంధిత ఓనర్లు   నీటి తొలగింపు,   చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు.  ఖాళీ ప్లాట్లలో నీరు నిలవడంతో దోమలు విజృంభిస్తున్నాయని,  అపరిశుభ్రత నిలుపుకొని పందులు స్వైర విహారం చేస్తాయన్నారు.  పుర పాలక చట్టం ప్రకారం కాలి స్థలాల్లో ఎలాంటి ముళ్లపొదలు పెరగకుండా, మురుగు,  అపరిశుభ్రత లేకుండా ఓనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్ చేసుకుని వదిలి వేస్తున్నారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, మురుగు పేరుకుపోయి అధ్వాన్నంగా మారుతున్నాయన్నారు.  మున్సిపాలిటీ ఆదేశాలు పట్టించుకోని యజమానులకు నోటీసులు పంపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈ రంజితు. దొంగరి శంకర్. గుండాల నరసయ్య. మాడుగుల పూలమ్మ.మున్సిపాలిటీ సిబ్బంది . మహేందర్. శేఖరు పాల్గొన్నారు.
Attachments area