వర్షాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి
హైదరాబాద్, జూన్ 28(జనంసాక్షి)
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబా ద్‌కు రానున్నారు. వర్షాకాల విడిది కోసం రాష్ట్రపతి నిలయానికి విచ్చేయనున్నారు. ఎప్పుడూ శీతాకాలంలో విడిది చేసే ప్రణ బ్… ఇపుడు వర్షాకాల విడిదికి సిద్ధమవు తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఓటు కు నోటుకు వ్యవహారంపై దుమారం రేగు తుండటంతో…. రాష్ట్రపతి నిలయానికి విఐ పిల తాకిడి పెరిగే అవకాశముంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్షాకాల విడిది కోసం హైద రాబాద్‌కు రానున్నారు. జూన్ 29 నుంచి జులై 8 వరకు ప్రణబ్‌దాదా భాగ్యన గరం లోనే విడిది చేస్తారు. సోమవారం మధ్యా హ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానశ్రయానికి వచ్చి… నేరు గా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.
అతిథి రాక ఏర్పాట్లలో తెలుగురాష్ట్రాలు..
ప్రణబ్ రాక సందర్భంగా తెలుగురాష్ట్రాలు ఏ ర్పాట్లలో మునిగిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర పతికి స్వాగతం పలుకనున్నారు. హైదరా బాద్ రావాలంటూ ప్రజాప్రతినిధులకు కల్వ కుంట్ల సూచించారు. ఈనెల 30న రాజ్ భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందులో ప్రణబ్ పాల్గొంటారు.
జులై 1న తిరుమలలో రాష్ట్రపతి పర్యటన..
జులై 1న రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శిం చుకోనున్నారు. ప్రణబ్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పద్మా వతి అతిథి గృహాన్ని ఆధునీకరించారు. బు ధవారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరుకు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.
సర్వాంగ సుందరంగా బొల్లారం రాష్ట్రపతి నిలయం..
రాష్ట్రపతి రాకతో బొల్లారంలోని రాష్ట్రపతి నిల యం సర్వాంగ సుందరంగా ముస్తాబ వుతోంది. మౌలికసదుపాయాల ఏర్పాటు కో సం అధికారులు
చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ల ఆధునీకరణ, పారిశుద్ధ్యం, చెత్తతొలగింపు, తాగునీటి సదుపాయం వంటి పనులను నిర్వహిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలిసారిగా వర్షాకాల విడిదికి ప్రణబ్..
విడిది సమయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో పాలనాపరమైన అంశాలను పరిశీలిస్తారు. తొలిసారిగా శీతాకాల విడిదికి బదులు… వర్షాకాల విడిదికి వస్తున్నారు. ఐతే తెలుగురాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారంపై దుమారం రేగుతోంది. దీంతో రాష్ట్రపతి నిలయానికి వీఐపీల తాకిడి పెరిగే అవకాశముంది. ఇటు తెలంగాణ, అటు ఏపీ నుంచి నేతలు, అధికారులు రాష్ట్రపతిని కలిసే అవకాశముంది.