వర్షాలతో సీజనల్‌ వ్యాధుల భయం

జిల్లాల్లో మలేరియా,డెంగ్యూల ప్రభావం
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్యారోగ్యశాఖ

హైదరాబాద్‌,జూలై9(జనంసాక్షి): యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గు న్యా, మెదడువాపు, ఫైలేలేరియా, అతిసారం, టైఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రావిూణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెందే అవకాశమున్నందున పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని వైద్యారోగ్య శాఖ ఏటా హెచ్చరిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ఇటీవల ఆయన సవిూక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సీజనల్‌ వ్యాధులతో పాటు, కరోనా నియంత్రణ చర్యలను కూడా ఏకకాలంలో కొనసాగించాలని వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటిసంబదిత, కీటక సంబందిత వ్యాధులు ప్రబలుతున్నందున్న జాగ్రత్తగా ఉండాలనిఆయా శాఖలను ఆదేశించారు. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న సామాజిక, బౌగోళిక వైరుధ్యాల కారణంగా యేటా వానాకాలంలో అంటు వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కూడా ప్రబలడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మలేరియా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లు రాష్ట్ర వైధ్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో..ఈ నేపథ్యంలోనియంత్రణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాదితులు మరణించినట్లు అధికారికంగా రికార్డు కాకపోయినా ఏజెన్సీలో ఎలాంటి డయాగ్నసిస్‌ చేయని కేసులే అధికంగా ఉన్నాయంటున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించామని చెబుతున్నా మారుమూల గ్రామాల్లో రహదారులు సరిగ్గా లేని కారణంగా సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి శాంపిల్స్‌ను సేకరించే పరిస్థితులు అంతంత మాత్రమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చాలా మంది జ్వరాల బారిన పడిన రోగులు అందుబాలులో ఉండే ఆర్‌ఎంపీలు, సాంప్రదాయ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాల విూదకి తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలో మలేరియా వంటి వ్యాధుల నియంత్రణ కోసం ఆదివాసీ గ్రామాల్లో వేల దోమ తెరలను పంపిణీ చేశారు. మారుమూల అటవీ గ్రామాల్లో ప్రతి సీజన్‌లో అంటు వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు సిబ్బంది కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వర్షాకాలంలో వాగులు, వంకలు దాటుకుంటూ అక్కడి చేరుకోవడం వైద్య సిబ్బందికి కత్తివిూద సాములా మారింది.