వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ


జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం (గోదావరి, బొక్కల వాగు సమీపంలో) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ పిలుపునిచ్చారు. తమకు ఎలాంటి సహాయం కావలసి వచ్చిన పరిష్కరించేందుకు మమ్ములను, వార్డు కౌన్సిలర్స్ సంప్రదించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండడానికి పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. వర్షాల వల్ల కలిగే సిజినల్ వ్యాధులు రాకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోనీ, చెత్తను తమ మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అప్పగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహములలో ఉండకూడదని, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గరకు ఎవరు వెళ్లకూడదని, ప్రజలు అధికారుల, ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు పాటించాలన్నారు.

తాజావార్తలు