వలసకూలీలను ఆపలేకపోతున్న ఉపాధి

అనంతపురం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన వేలాదిమంది కూలీల కోసం బతుకుతెరువ కోరకుకుంటూ వెళ్లారని, ప్రభుత్వానికి వలసల నివారణపై శ్రద్ద లేదని ప్రజాసంఘాల నేతలు అన్నారు. వలసల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ప్రకటనకే
పరిమితమవుతోందన్నారు. గ్రామాలలో కొన్ని చోట్ల ఫీల్డ్‌ అసిస్టేంట్‌లు లేకపోవడంతో పనులు గుర్తించడం సాధ్యం కావడంలేదు. వలసలు వెళ్ళకుండా చూడాలని గట్టిగా చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా సబందిత అధికారులు స్పందించి గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించి వలసలను ఆపాలని కూలీలు, చిన్న సన్నకార రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ సాయం కనుచూపు మేరలో కూడా కనిపించక పోవడంతో గ్రావిూణ ప్రాంత, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకార రైతులు పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం పిల్లా పాపలతో మూటముళ్లు సర్దుకుని రైళ్లు, బస్సుల్లో వలస వెళ్తున్నారు. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసిన ఫారంపాండ్లు కూడా నేటికీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. రబీ సీజన్‌ ముగియడంతో గ్రామాల్లో వ్యవసాయ పనుల్లేక కూలీలు, సన్నచిన్న కారు రైతులు ఉపాధి కోసం వలసబాట పట్టారు. పశువులకు మేత, నీరు సమకూర్చ లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పలు గ్రామాల్లో అరకొరగా గుంతలు తవ్విన ఫారంపాండ్లలో తిరిగి అదే ఫారంపాండ్లలో పనులు చేస్తూ బిల్లులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో నేల గట్టిగా ఉంటోంది. దీంతో ఫారంపాండ్ల పనులు ఇబ్బందికరంగా మారుతోందని కూలీలు వాపోతున్నారు.