వస్తున్నా మీకోసం తో జిల్లా టిడిపిలో నూతనోత్తేజం
నిజామాబాద్, నవంబర్ 27: వస్తున్నా మీకోసం యాత్ర పొరుగున ఉన్నా మెదక్ జిల్లాలో విజయవంతం కావడంతో ఈ నెల 28న జిల్లాలో ప్రవేశించే చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు కసరత్తులు చేస్తున్నారు. పార్టీ అధినేత రాక సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనేత్తజం కనిపిస్తుంది. ఈ పాటికే టిడిపి జిల్లా ఇంచార్జి కడియం శ్రీహరి రెండు సార్లు జిల్లాలో పర్యటించి పాదయాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అందుకనుగుణంగా జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ నేతృత్వంలో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసారు. ముఖ్యంగా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మ, హన్మంత్ షిండే,ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డిలు రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులు అమర్‌నాథ్‌బాబు, టిఎన్‌ఎస్‌ఎఫ్ కార్యదర్శి రవికుమార్, మేడపాటి ప్రకాష్‌రెడ్డిలు పాదయాత్ర జరిగే జుక్కల్,బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను చైతన్య వంతులను చేసారు. జుక్కల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే హన్మంత్ షిండే గ్రామగ్రామాన పర్యటించి పాదయాత్రను విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. బాన్స్‌వాడ నియోజకవర్గంలో కార్యకర్తలను ముందుకు నడిపించడానికి ఇంచార్జి బద్యానాయక్,కమ్మసత్యనారాయణ,కోటగిరి మండల కన్వీనర్ నాగులు గ్రామగ్రామాన పర్యటించి బాబు యాత్ర విజయానికి చర్యలు తీసుకున్నారు. గతంలో టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గమైన బాన్స్‌వాడలోనే అత్యదిక గ్రామంలో బాబు యాత్ర కొనసాగనుంది.ఇక్కడ తిరుగులేని నాయకుడిగా సుదీర్ఘకాలంగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెంట టిడిపి ద్వితీయశ్రేణి నాయకులు కొంతమంది వెళ్లినప్పటకిని పార్టీలో ఉంటూ వస్తున్న టిడిపి నాయకులు,కార్యకర్తల్లో మనోదైర్యాన్ని నింపేందుకు బాబు పర్యటన ఎంతగానో ఉపయోగకరంగా ఉండవచ్చని భావిస్తున్నారు.టిడిపి సమావేశాలకు హాజరుకావలంటే ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు నేడు ఉత్సహాంగా పాల్గోంటున్నారు.
కోటగిరి మండలంలో పార్టీ అధినేత చంద్రబాబు మహిళా డిక్లరేషన్ ప్రకటించి మహిళలకు మరింత చేరుకకావడానికి కొత్త పథకాలు ప్రకటించనున్నారు.టిడిపి హాయంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆస్తిహక్కు, విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు,గ్రామీణ మహిళల కోసం ప్రవేశపెట్టిన దీపం పథకం, స్వయం సహయక సంఘాలు వంటి అంశాలపై డిక్లరేషన్ ప్రకటిస్తారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు,ఎస్సీ వర్గీకరణకు మద్దతు,రైతుల రుణాల మాఫీ వంటగ్యాస్ సిలిండర్ల భరోసా,బిసిలకు వందసీట్లు,బడుగు బలహీన వర్గాలకు , మైనారిటిలకు ప్రత్యేక ప్యాకేజిలపై ప్రకటనలు చేయడం ఉత్తేజం నింపింది. దేశంకు దూరమైన రైతులకు రుణమాఫీ, విద్యుత్ వంటి అంశాలపై చేసిన ప్రకటనలతో రైతులు దగ్గర అవుతున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు.