వస్త్ర వ్యాపారుల నిరసన
ఇల్లందు: వస్త్ర వ్యాపారులు వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఇల్లందులో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఉగ్గవాగు వంతెన పై రాస్తారోకో నిర్వహించారు. వ్యాట్‌ను విధించి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సురేష్ లాకోటి, మల్లికార్జున్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం వస్త్ర వ్యాపార సంస్థలను మూసివేసి నిరసన తెలిపారు.