వాగుదాటుతూ ఇద్దరు మహిళల గల్లంతు
ఖమ్మం : జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని దమ్మపేట మండలంలోని గణేష్‌పాడు వద్ద రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ఉధృతంగా లేదని భావించిన ఇద్దరు మహిళలు వాగు తాటడానికి ప్రయత్నించి అందులోనే కొట్టుకుపోయారు. వీరు ఈనగుంపు గ్రామానికి చెందిన బంగారి తిరుపతమ్మ (35), బండారి పుష్పవతి (16) గా గుర్తించారు.