వాగులో బస్సు బోల్తా : 15 మందికి గాయాలు
ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం నిర్శింహుల గూడెం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వాగులో బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఖమ్మం నుంచి కూసుమంచి మీదుగా నల్లగొండ జిల్లా తుమ్ముగూడెం గ్రామానికి వెళ్లిన బస్సు తిరుగు ప్రయాణంలో ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రమాదానికి గురైంది. వాగులో 3 అడుగుల నీరు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 40 మందితో వెళ్తున్న ఈ బస్సులో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.