వాగ్దానాలపై యూ టర్న్‌ తీసుకున్నారు

2

– ఆర్‌టీఐ పారదర్శకత కోల్పోయింది

– కార్పోరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారు

– పార్లమెంట్‌లో సోనియా, రాహుల్‌ ధ్వజం

న్యూఢిల్లీ,మే 6 (జనంసాక్షి):  ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోచీ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  వాగ్దానాలపై యూటర్న్‌ తీసుకున్నారని ,   మోడీ పాలనను ఎండగట్టారు. ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు పోవడంలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. వాగ్ధానాలు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్య పదవులను నింపడంలో ప్రభుత్వం పతనమైందన్నారు. వాగ్ధానాలపై యూట్నం తీసుకోవడం సరికాదన్నారు. సమాచారం హక్కు చట్టం కింద సమాచారం కోసం 39,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. అవన్నీ పెండింస్త్రలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం దయనీయమైన పరిస్థితుల్లో ఉందన్నారు. సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇదిలావుంటే కార్పొరేట్‌ వర్గాలకు సాయం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం సీవీసీ, ఆర్టీఐ, లోచీపాల్‌ వంటి పదవులను భర్తీ చేయడం లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజలకు అవకాశం కల్పించే వ్యవస్థల్ని మోదీ సర్కాం నిర్వినియోగం చేస్తోందని మోదీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం రాహుల్‌ గాంధీ విూడియాతో మాట్లాడుతూ ఆ మూడు పదవులకూ నియామకాలను నిలిపివేశారు ఎందుకని ప్రశ్నించారు. లోచీసభలో ప్రశ్నిస్తే… పక్రియ కొనసాగుతోందని చెబుతున్నారని, పక్రియను ఆపాలని, జాప్యం చేయాలనీ సుప్రీం కోర్టు ఏనాడూ చెప్పలేదని ఆయన అన్నారు. నెలలు, ఏళ్లు గడిచిపోయాయి.. కానీ పదవులు భర్తీ చేయలేదు ఎందుకంటే… ఈ సూట్‌ బూట్‌ సర్కాం ప్రజల నుంచి భూమి లాక్కోవాలని భావిస్తోందని రాహుల్‌ విమర్శించారు. దేశాన్ని తమ మిత్రులైన 7-8 మంది పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని రాహుల్‌ ఆరోపించారు.