వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయండి
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్29(జనంసాక్షి):
ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన ప్రతిచోట నల్లాల ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా ప్రారంభించాలని చెప్పారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి అధికార నివాసంలో సవిూక్ష జరిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరోవైపు, గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గడా ప్రత్యేక అధికారి హన్మంతరావును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సవిూక్షలో మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇ ఎన్ సీ సురేందర్ రెడ్డి, గడా ప్రత్యేక అధికారి హన్మంత రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.