వాడి వేడిగా సర్వసభ్య సహకార సంఘం సమావేశం
సి ఓ ఇష్టారాజ్యం
విహార యాత్రలకు ఒకరికి బదులు ఒకరు వెళ్లడం
సహకార సంఘం నిధులు దుర్వినియోగం సభ్యుల ఆగ్రహం
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 28
శంకరపట్నం మండలంలోని గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, ఆధ్వర్యంలో పోతర్ల శ్రీనివాస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులకు సంఘ సభ్యులకు తీరని అన్యాయం చేస్తున్నారని ,సంఘ సభ్యులు పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం అర్థ వార్షిక 22, 23 సంవత్సరం సర్వసభ్య సమావేశం అధ్యక్షులు గుర్రాల తిరుపతిరెడ్డి అధ్యక్షతన రాజాపూర్ గద్దపాక బ్యాంక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సంఘ సభ్యులు, సంఘం పాలకవర్గ సభ్యుడు, మాజీ చైర్మన్ మేచినేని శ్రీనివాసరావు, ఖాతాదారుడు పాలకరోగ సభ్యురాలు అయిన నరహరి రజిని భర్త నరహరి తిరుమలరెడ్డి మాట్లాడారు. సంగం అధ్యక్షుడు గుర్రాల తిరుపతిరెడ్డి, సంగం సీఈఓ పోతర్ల శ్రీనివాస్ సంఘం కు కేంద్ర ప్రభుత్వం అందించే మూడు శాతం రాయితీ డబ్బులను 2018 నుండి సభ్యులకు నేటికీ పంపిణీ చేయకుండా సంఘంలో ఉన్నట్లు చూపిస్తూ తన సొంత ఖర్చులకు సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయలను రైతులకు పంచకుండా రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వుల మేరకు వరి ధాన్యము కొనుగోలు చేసిన కమిషన్ డబ్బుల లెక్కలు కూడ చెప్పకుండ, గన్ని సంచుల పేరుతో సుమారు 5 లక్షల రూపాయల వరకు సీఈవో పోతర్ల శ్రీనివాస్ స్వాహా చేసినట్లు చెప్పారు. అర్థ వార్షిక నివేదికలో చైర్మన్, సీఈవో ఇష్టానుసారంగా లెక్కలను పొందుపరిచారని నిలదీయడంతో, సంగం విశ్రాంత సీఈఓ చింత రెడ్డి రాజిరెడ్డి, కలుగజేసుకొని, సంఘం ఆదాయవ్యలను వివరించడం చాలా విడ్డూరంగా ఉందని, సంఘం ఆధ్వర్యంలో విహారయాత్రలకు ఏర్పాటుచేసి, భార్యలకు బదులుగా భర్తలను, తండ్రికి బదులు కొడుకులను చైర్మన్ తిరుపతి రెడ్డి విహారయాత్రలకు తీసుకపోయి సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నట్లు సభ్యులు తెలిపారు. ఇట్టి విహారయాత్రల ఖర్చును ఎక్కడి నుండి పెడుతున్నారో లెక్క చెప్పాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం సీఈఓ గా కొనసాగుతున్న పోతర్ల శ్రీనివాస్ ను విధుల నుండి తొలగించాలని సంఘ సభ్యుల కోరిన చైర్మన్ తిరుపతి రెడ్డి తొలగించడం లేదని ప్రస్తుత చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ చైర్మన్ సంఘ సభ్యులు మేచినేని శ్రీనివాసరావు, నరహరి రజిని తిరుమల్ రెడ్డి తోపాటు పలువురు పాలకొరక సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా సీఈవో పోతర్ల శ్రీనివాస్ ను విధుల తొలగించాలని డిమాండ్ చేసి అర్థ సంవత్సర వార్షిక సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం పాలకవర్గ సభ్యులు, సంఘ పరిధిలోని గద్దపాక ,కాజాపూర్, రాజాపూర్ , కల్వల,రైతులు, ఖాతాదారులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.